జనవరిలో 24,660 రెసిడెన్సీ పర్మిట్స్‌

- March 13, 2017 , by Maagulf
జనవరిలో 24,660 రెసిడెన్సీ పర్మిట్స్‌

ఇ-గవర్నమెంట్‌ (హుకూమి) ద్వారా 24,660 రెసిడెన్సీ పర్మిట్స్‌ని మంజూరు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ నివేదిక ప్రకారం వెల్లడవుతోంది. డిసెంబర్‌తో పోల్చితే 14.6 శాతం పెరుగుదల నమోదయ్యింది. డిసెంబర్‌లో 21,522 పర్మిట్స్‌ మంజూరు చేశారు. అయితే డిసెంబర్‌తో పోల్చితే ఎగ్జిట్‌ పర్మిట్స్‌ సంఖ్య 1,091కి పడిపోయింది. 95.5 శాతం తక్కువ ఇది. డిసెంబర్‌లో ఎక్కువమంది హాలీడేస్‌ కోసం వెళ్ళిపోవడమే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు. హెల్త్‌ కార్డ్స్‌ రెన్యూవల్‌ విషయంలో 17.4 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 31,449 హెల్త్‌ కార్డులు జారీ చేశారు. మెడికల్‌ ప్రాక్టీషనరల్స్‌ విషయంలోనూ 14.3 శాతం పెరుగుదల నమోదవగా, మొత్తం 1,082 లైసెన్సుల్ని జారీ చేశారు. మెడికల్‌ కమిషనల్‌ హెల్త్‌ చెక్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారి సంఖ్య 51,941గా ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com