అతి వేగమే ప్రమాదాలకు కారణం
- March 13, 2017
మస్కట్: 55 శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. 2015తో పోల్చితే 2016లో రోడ్డు ప్రమాదాలు 32.8 శాతం తగ్గినట్లు తేలింది. వీటిల్లో కూడా 55 శాతం ప్రమాదాలు అతి వేగం కారణంగానే జరిగాయి. స్పీడ్ లిమిట్‌ని పాటించని వాహనాల వల్ల 63 శాతం మంది గాయాల పాలయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిఎస్‌ఐ) వివరాల & రపకారం 2016లో మొత్తం 3261 ప్రమాదాలు చోటు చేసుకోగా, 692 మంది మృతి చెందారు. అతి వేగం కారణంగా 2499 ప్రమాదాలు జరిగాయి. 2052 మంది గాయాల పాలవగా, 378 మరణాలు అతి వేగతంతోనే జరిగినట్లు లెక్కలు తేల్చాయి. నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్ కారణంగా 15 శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి. రిస్కీ ఓవర్‌టేకింగ్ 10 శాతం మరణాలకు కారణం. 'యువర్ లైఫ్ ఈజ్ ఎ ట్రస్ట్' పేరుతో రాయల్ ఒమన్ పోలీసులు ఓ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచగలమని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు







