మొలకెత్తిన గింజలను పచ్చిగానే ఎందుకు తినాలి? మాంసాహారం తింటే?
- March 14, 2017
మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. ఉడికించి తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలు కూడా లభిస్తాయి. అలాకాకుండా ఉడకబెట్టినా, వేడి చేసినా వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. ఈ గింజలతో పచ్చి క్యారెట్లను కలిపి తింటే శరీరానికి కావాల్సిన బీటా కెరోటిన్ సమృద్ధిగా అందుతుంది.
మొలకెత్తిన గింజలు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మధ్యాహ్నం ఆహారంలో మాంసాహారం తీసుకుంటే సాయంత్రం స్నాక్స్‌లో మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మాంసాహారం నుంచి వచ్చే అధిక కొవ్వు బారి నుండి గింజలు మనల్ని రక్షిస్తాయని.. అలాగే మాంసంలోని కొవ్వును పీల్చుకోవడం ద్వారా దాన్ని శరీరంలోని ఇతర వ్యర్థపదార్థాలతో కలిపి బయటికి పంపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మొలకెత్తిన గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా ఆకలి వేయదు. తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది. శరీరం చురుగ్గా ఉండాలంటే వారంలో కనీసం ఒక్కసారైనా మొలకెత్తిన గింజల్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మొలకలు తినడం ద్వారా గ్యాస్, ఎసిడిటీ తదితర సమస్యలు దూరమవుతాయని వారు చెప్తున్నారు.
తాజా వార్తలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!







