భారతీయ వ్యక్తి ఫేస్బుక్ దుర్వినియోగం 250,000 ధిర్హాంల జరిమానా...దేశ బహిష్కరణ
- March 14, 2017
' చెరపకురా ....చెడేవు ' అనే పదం ఈ వార్తకు సరిగ్గా సరిపోతుంది...గత ఏడాది ఆగస్టులో ప్రముఖ మలబారు గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థపై ఫేస్బుక్ లో అవాకులు చెవాకులు పేలిన ఓ పోస్ట్ ని కేవలం షేర్ చేసినందుకు ఫలితం ఒక భారతీయుడికి 250,000 ధిర్హాంల జరిమానా, దేశ బహిష్కరణ ఏకకాలంలో దక్కాయి. సామాజిక మీడియాలో తమకు సంబంధం లేని విషయాలపై జోక్యం చేసుకొంటే...ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఆ శిక్ష ఏ స్థాయిలో ఉంటుందో ఇందుకు అద్దం పడుతుంది. ఫేస్బుక్ దుర్వినియోగం చేసిన ఆ భారతీయునికి వ్యతిరేకంగా దుబాయ్ లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఈ తీర్పు జారీ చేసింది. అంతే కాకుండా సంబంధిత వ్యక్తికి చెందిన ఫేస్బుక్ లో ఆయా వివాదాస్పద ఫోటోలు తొలగించి తన ప్రొఫైల్ అకౌంట్ ను ఒక సంవత్సరం పాటు మూసివేయాలని ఆదేశించింది. అయితే, ఈ 36 ఏళ్ళ భారతీయ వ్యక్తి నేరంపై ఏడు రోజుల్లో మరల ఒక విజ్ఞప్తిని కోర్టుకు చేసుకొనే హక్కు ఉందని ఆదివారం వెలువడిన ఆ తీర్పులో వెలువరించింది. అదే సంస్థలో ఉద్యోగిగా గతంలో పనిచేశాడు. తన మాజీ యజమానిపై , మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థను కించబరుస్తూ వ్యతిరేకంగా వెలువడిన ఓ ఫేస్బుక్ పోస్ట్ ని షేర్ చేసిన కారణంగా గత ఏడాది ఆగస్టులో నిందితుడిని దుబాయ్ పోలీసులు అరెస్టు సైతం చేశారు. గత ఏడాది దుబాయ్ లో పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున వినియోగదారుల కోసం ఒక పోటీ నిర్వహించిన కార్యక్రమంలో ఇదే భారతీయ వ్యక్తి భారతదేశం మరియు యూఏఈ లో సామాజిక మీడియా ద్వారా వినియోగదారులకు సంస్థని అనుకూలంగా ప్రాచుర్యం చేసిన చురుకైన నేపధ్యం సైతం ఆయనకు ఉంది.
తాజా వార్తలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!







