మొలకెత్తిన గింజలను పచ్చిగానే ఎందుకు తినాలి? మాంసాహారం తింటే?

- March 14, 2017 , by Maagulf
మొలకెత్తిన గింజలను పచ్చిగానే ఎందుకు తినాలి? మాంసాహారం తింటే?

మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. ఉడికించి తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలు కూడా లభిస్తాయి. అలాకాకుండా ఉడకబెట్టినా, వేడి చేసినా వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. ఈ గింజలతో పచ్చి క్యారెట్లను కలిపి తింటే శరీరానికి కావాల్సిన బీటా కెరోటిన్‌ సమృద్ధిగా అందుతుంది. 
 
మొలకెత్తిన గింజలు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మధ్యాహ్నం ఆహారంలో మాంసాహారం తీసుకుంటే సాయంత్రం స్నాక్స్‌లో మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మాంసాహారం నుంచి వచ్చే అధిక కొవ్వు బారి నుండి గింజలు మనల్ని రక్షిస్తాయని.. అలాగే మాంసంలోని కొవ్వును పీల్చుకోవడం ద్వారా దాన్ని శరీరంలోని ఇతర వ్యర్థపదార్థాలతో కలిపి బయటికి పంపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
మొలకెత్తిన గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా ఆకలి వేయదు. తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది. శరీరం చురుగ్గా ఉండాలంటే వారంలో కనీసం ఒక్కసారైనా మొలకెత్తిన గింజల్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మొలకలు తినడం ద్వారా గ్యాస్‌, ఎసిడిటీ తదితర సమస్యలు దూరమవుతాయని వారు చెప్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com