ముంచెత్తిన మంచు తుపాన్‌ అమెరికాలో

- March 14, 2017 , by Maagulf
ముంచెత్తిన మంచు తుపాన్‌ అమెరికాలో

అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. తూర్పు తీరంలోని ఆరు రాష్ర్టాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ శీతాకాలంలోనే తొలిసారి భారీస్థాయిలో కురుస్తున్న మంచు ధాటికి జనజీవనం అతలాకుతలమవుతోంది. న్యూయార్క్‌ మొదలుకొని పెన్సిల్వేనియా, హడ్సన్‌ వ్యాలీ, వెర్మాంట్‌, న్యూహాం్‌పషైర్‌ కనెక్టికట్‌, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ వరకూ విలవిలలాడుతున్నాయి. దాదాపు 31 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై రెండు అడుగులకుపైగా మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. న్యూయార్క్‌, బోస్టన్‌, బాల్తిమోర్‌, వాషింగ్టన్‌, ఫిలడెల్ఫియా ఏయిర్‌పోర్టుల్లో మంచు పేరుకుపోవడంతో ఇప్పటి వరకు 7,700 వరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
సోమవారం ఒక్కరోజే 1,658 విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్‌తోపాటు పలు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. మరో 24 గంటలూ ఇదే రీతిలో మంచు కురుస్తుందని ఆదేశ జాతీయ వాతావరణ సేవా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. న్యూయార్క్‌లో 16 నుంచి 20 అంగుళాలమేర మంచు కురవొచ్చని తెలిపింది.

వచ్చే రెండుమూడు రోజుల్లో దక్షిణ ప్రాంతంలోని మెయిన్‌ ప్రాంతం నుంచి విర్జీనియా వరకు, దక్షిణ వాషింగ్టన్‌లోనూ మంచు తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com