దాడులను నియంత్రణకు భారతీయులకు రక్షణగా ప్రచారం

- March 14, 2017 , by Maagulf
దాడులను నియంత్రణకు భారతీయులకు రక్షణగా ప్రచారం

- జాతివిద్వేష దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం 
 అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతివిద్వేష దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ-అమెరికన్ల ప్రజావ్యవహారాల సంయుక్త కమిటీ పేరుతో చికాగోలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నారు. భారత సంతతి ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఐఏపీఏసీ సభ్యుడు అశ్విన్‌ ధాల్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నలుగురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఐఏపీఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా, న్యూయార్క్‌, న్యూజెర్సీ, చికాగో, డల్లాస్‌, సియాటెల్‌ ప్రాంతాల్లో తొలుత ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. కన్సాస్‌ రాష్ట్రంలో భారతీయుడు కూచిబొట్ల శ్రీనివాస్‌పై జరిగిన దాడుల వంటివి ఇకపై జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటన ద్వారా తెలిపారు. అధికారులు, స్థానికులు, వ్యాపారులు దీనిలో పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com