ఇది పేదల ప్రజల సంక్షేమ బడ్జెట్: డాక్టర్ ముక్కు తులసి కుమార్

- March 15, 2017 , by Maagulf
ఇది పేదల ప్రజల  సంక్షేమ  బడ్జెట్: డాక్టర్ ముక్కు తులసి కుమార్

యుఏఈ​ నుండి ఆర్థికశాస్త్ర విద్యార్ధి డాక్టర్ ముక్కు తులసి కుమార్.

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం  అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ రాష్ట్రపేదల ప్రజల  సంక్షేమ  బడ్జెట్ అని ఎస్ వి యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర పూర్వ విద్యార్ధి , యుఏఈ​ తెలుగు దేశం పార్టీ యువత నాయకుడు  డాక్టర్ ముక్కు తులసి కుమార్ అన్నారు.  

రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటు లాంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని   హైదరాబాద్‌ నుంచి ముందుగానే అమరావతికి పాలన తీసుకొచి  ఆంధ్రప్రదేశ్‌  రాజధాని అమరావతి వేదికగా తొలి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశ పెట్టడం రాష్ట్ర ప్రజల సంక్షేమ  విజన్ బడ్జెట్  అన్నారు. అనేక సమస్యలు ఉన్నాకూడా ఆర్ధిక అభివృధ్ధికోసం , ప్రత్యేక విజన్ కోసం ఈ బడ్జెట్ రూపొందించడం ఆనందం అని  అన్నారు.

స్వతహాగా ఆర్ధిక శాస్త్ర విద్యార్ధి ఐన ముఖ్యమంత్రి ప్రజల ఆర్ధిక పరిస్థితులు పూర్తిగా అవగానే తోనే ఈ బడ్జెట్ పేదల సంక్షేమ  బడ్జెట్ గ రోపొందించడం రాష్ట్ర ప్రజలు అదృష్టం అని డాక్టర్ ముక్కు తులసి కుమార్ అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖకు,వ్యవసాయ, అనుబంధ రంగాలకు,నిరుద్యోగ భృతి,గ్రామీణాభివృద్ధికి, ఉన్నత విద్య, పాఠశాల విద్యకు ,బ్రాహ్మణ , కాపు,బీసీ ,ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ,రాష్ట్ర క్రైస్థవ సంక్షేమం కోసం,  పట్టణాభివృద్ధికి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యానికి,హోంశాఖకు , అధిక  ప్రాధాన్యం ఇవ్వడం అభివృద్ధికి నిదర్శనం అన్నారు. పేదల సంక్షేమ కోసం ప్రత్యేక శ్రద్ధతో  ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి గల్ఫ్ తెలుగు ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

‘ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చి దిద్దుతారు అనడం లో ఈమాత్రం సందేహం లేదు అని , విభజన తర్వాత ఎన్నో సవాళ్లు తట్టుకుని గొప్ప పరిణితి తీసుకురాగలిగిన ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుగారి  ప్రత్యేక కృతజ్ఞతలు  తెలియజేసారు, చారిత్రక నగరమైన అమరావతికి దాదాపు 2000 ఏళ్ల తర్వాత శాసనాధికారం తిరిగి సంప్రాప్తించిన సందర్భంలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం రాష్ట్ర ప్రజల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com