అంచలంచలుగా పెరుగుతున్న పసిడి మరియు వెండి ధరలు..!

- September 25, 2015 , by Maagulf
అంచలంచలుగా పెరుగుతున్న పసిడి మరియు వెండి ధరలు..!

 బంగారం ధర నెల రోజుల గరిష్ఠానికి చేరింది. మళ్లీ రూ.27,000 మార్కును దాటేసింది. ఈ రోజు రూ.400 పెరగడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,250కి చేరింది. పెళ్లిళ్ల సీజను ముందుండటం, రీటైలర్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం తదితర కారణాల వల్ల ఈ లోహం ధర పెరుగుతోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2.11శాతం పెరిగి 1,152 అమెరికన్‌ డాలర్లకు చేరింది.పెరిగిన వెండిఈ రోజు వెండి సైతం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగి రూ.36,000 మార్కును దాటేసింది. ఈ రోజు రూ.1,100 పెరగడంతో కేజీ వెండి ధర రూ.36,500కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో ధరలు పెరిగాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 15.15 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com