అక్షయ్ కోటి సాయం అమర జవాన్లకు
- March 16, 2017
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడిలో వీరమరణం పొందిన ఒక్కో సీఆర్‌పీఎఫ్ జవాను కుటుంబానికి రూ.9లక్షల చొప్పున నగదును (మొత్తంగా కోటీ ఎనిమిది లక్షలు) బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అందజేశారు. మార్చి 11న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ దాడిలో 12 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
దాడి విషయం తెల్సుకుని, జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ను అక్షయ్ సంప్రదించారని అధికారులు వెల్లడించారు. జవాన్ల కుటుంబీకుల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని బుధవారం ఆయా ఖాతాలకు అక్షయ్ నగదును బదిలీచేశారని చెప్పారు. దేశభక్తిని చాటడంతో అక్షయ్ ఎల్లపుడూ ముందుంటారని, ప్రత్యేకంగా సీఆర్‌పీఎఫ్ బలగాల విషయంలో అంకిత భావంతో ఉంటారని సీఆర్‌పీఎఫ్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







