గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ అందుకోనున్న దర్శకుడు హేమంతరావు

- March 16, 2017 , by Maagulf
గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ అందుకోనున్న దర్శకుడు హేమంతరావు

నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ పేరు మీద ప్రతి యేటా ఉత్తమ నూతన దర్శకుడికి అవార్డ్ అందజేస్తారు అన్న సంగతి విధితమే.. కాగా 2016 ఏడాదికి గాను గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం కన్నడ దర్శకుడు హేమంతరావు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో కొత్త దర్శకులు తెరకెక్కించిన 20 ఉత్తమ చిత్రాల్లో హేమంత్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం 'గోది బన్నసాధరణ మైకట్టు' సినిమా సీనియర్‌ నటి పూర్ణిమ భాగ్యరాజ్‌, సీనియర్‌ దర్శకుడు రాజేంద్రసింగ్‌బాబు తదితరులతో కూడిన జ్యూరీని మెప్పించింది. 20వ గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ పురస్కారాన్ని వచ్చే ఆగస్టు 12వ తేదీన చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీ వేదికగా ప్రదానం చేయనున్నట్లు గొల్లపూడి తనయులు సుబ్బారావు, రామకృష్ణ వెల్లడించారు. పురస్కారం కింద రూ.1.50 లక్షల నగదు, జ్ఞాపిక అందిస్తారు. కాగా, గతంలో ఈ పురస్కారాలను అందుకున్న ఉత్తమ నూతన దర్శకుల్లో హిందీ నటుడు అమీర్‌ఖాన (తారే జమీనపర్‌), తెలుగు దర్శకులు మోహనకృష్ణ (గ్రహణం), రాజనీష్‌ దోమలపల్లి (వనజ) తదితరులు ఉన్నారు. 1992లో తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ప్రమాదవశాత్తు విశాఖ సముద్రతీరాన మరణించిన ప్రముఖ తెలుగు నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు 19 ఏళ్లుగా అవార్డు ప్రదానం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com