లిక్కర్ స్మగ్లింగ్‌ని భగ్నం చేసిన కస్టమ్స్
- March 17, 2017
సౌదీ కస్టమ్స్, తాజాగా లిక్కర్ బాటిల్స్‌ని టైర్లలో ఉంచి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకుంది. బహ్రెయిన్ నుంచి ఇవి వస్తుండగా పట్టుకున్నట్లు కస్టమ్స్ వర్గాలు వెల్లడించాయి. ఓ వాహనం టైర్ల నుంచి మొత్తం 312 లిక్కర్ బాటిల్స్‌ని కింగ్ ఫవాద్ కాజ్‌వే పై పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాలోకి వీటిని తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనానికి చెందిన నాలుగు టైర్లలో ఈ లిక్కర్ బాటిల్స్‌ని గుర్తించినట్లు కింగ్ ఫవాద్ కాజ్ వే సౌదీ కస్టమ్స్ జనరల్ డైరెక్టర్ దైఫల్లా అల్ ఒతైబి చెప్పారు. వారం రోజుల క్రితం ఓ వాహనం పెట్రోల్ ట్యాంక్‌లో 46 బాటిల్స్ మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన వివరించారు. గత నెలలో ఓ సారి ఇలాగే 100 బాటిల్స్ లిక్కర్‌ని, వాహనం టైర్లలో తరలించేందుకు ప్రయత్నించగా, దాన్నీ భగ్నం చేశారు. మరో ఘటనలో కస్టమ్స్ అధికారులు 105 కిలోగ్రాముల బ్యాన్డ్ యానిమల్ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటినీ వాహనం టైర్లలో భద్రపరచి తరలించేందుకు ప్రయత్నించారు స్మగ్లర్స్.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









