ఎస్ బి ఐ కార్డ్స్ పై 15 శాతం డిస్కౌంట్ ఇస్తున్న ఖతార్ ఎయిర్వేస్

- March 17, 2017 , by Maagulf
ఎస్ బి ఐ  కార్డ్స్ పై  15 శాతం  డిస్కౌంట్ ఇస్తున్న ఖతార్ ఎయిర్వేస్

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరియు ఖతార్ ఎయిర్వేస్ ఒక భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్యాంకు యొక్క వ్యాపార మరియు రిటైల్ కార్డుదారులకు అందించే బిసినెస్ క్లాస్ టిక్కెట్లు 15 శాతం డిస్కౌంట్ మరియు ఎకానమీ క్లాస్ టిక్కెట్లలో10 శాతం డిస్కౌంట్ అమెరికా, ఐరోపా మరియు ఆఫ్రికా దేశాలకు వర్తిస్తుంది. ఈ అవకాశం  డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మరియు ఏప్రిల్ 7 వ తేదీ నుంచి  సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేసేవారికోసం మరియు ముందుగా చేసిన బుకింగ్స్ పై వర్తిస్తుందని కతర్ జాతీయ క్యారియర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్బిఐ భారీగా ఉన్న కార్పొరేట్ ఖాతాదారుల పరపతిని దృష్టిలో ఉంచుకొని ఉపఖండంలో ఈ భాగస్వామ్యాన్ని నెలకొల్పినట్లు ఖతార్ ఎయిర్వేస్ సీనియర్ మేనేజర్ నవీన్ చావ్లా తెలిపారు. ఇక్కడ ఒక దేశీయ ఎయిర్లైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి  యోచిస్తున్నట్లు తెలిపారు. ఖతార్ ఎయిర్వేస్, 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడి సొంతంగా195 విమానాలను కలిగి ఉందని  ఆరు ఖండాలలోని 150 అంతర్జాతీయ గమ్య స్థానాలకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తున్నట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com