కొరటాల శివ,యన్.టి.ఆర్ కాంబినేషన్ లో సినిమా?
- September 26, 2015
టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దశ తిరిగిపోతోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో పలువురు హీరోలు 'కొరటాల' దర్శకత్వంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో 'మిర్చి'లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినప్పటికీ ఆయనతో సినిమా చేసేందుకు అంగీకరించిన కొంతమంది హీరోలు చివరి నిమిషంలో సినిమా చేయడానికి నిరాకరించారు. దీంతో దాదాపు రెండేళ్ళు కొరటాల శివ ఖాళీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా 'శ్రీమంతుడు' బ్లాక్‌బస్టర్‌తో మళ్ళీ కొరటాల శివ చుట్టూ బడా హీరోలందరూ చక్కెర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో రోజుకో హీరోతో కొరటాల శివ సినిమా ఉంటుందనే ఊహాగానాలు సైతం సామాజిక మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పాతదే అయినా తాజాగా వచ్చిన ఓ సరికొత్త న్యూస్ ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్స్ లో సందడి చేస్తోంది. 'కొరటాల శివ' తదుపరి చిత్రంలో 'జూ.ఎన్టీఆర్' నటిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తొలి ప్రయత్నంలోనే 'శ్రీమంతుడు'వంటి మెగాహిట్ ఇచ్చిన మైత్రిమూవీస్ నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు విజయదశమి రోజున ప్రారంభిస్తున్నారని టాలీవుడ్ టాక్. ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







