ఉమ్‌ అల్‌ కువైన్‌ ట్రాఫిక్‌ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్‌

- March 20, 2017 , by Maagulf
ఉమ్‌ అల్‌ కువైన్‌ ట్రాఫిక్‌ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్‌

ఉమ్‌ అల్‌ కువైన్‌ పోలీస్‌, ఇంటర్నేషనల్‌ హ్యాపీనెస్‌ డే సందర్భంగా, ట్రాఫిక్‌ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్‌ని అందజేస్తోంది. ఒక్క రోజు మాత్రమే ఈ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది. ఉయ్‌ అల్‌ కువైన్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ - ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ సయీద్‌ ఒబైద్‌ బిన్‌ అరాన్‌ మాట్లాడుతూ, ఈ నిర్ణయంతో పబ్లిక్‌లో ఆనందం నెలకొంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈ వ్యాప్తంగా 2008 నుంచి ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై ప్రమాదాల నివారణ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనలకు చోటు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారీ జరీమానాలు ఉల్లంఘనుల కోసం విధిస్తున్నారు. జరీమానాలు, బ్లాక్‌ పాయింట్లతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చాలా వరకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com