క్రిమియన్-కాంగో జ్వరం ముగ్గురు మృతి ఒమాన్ లో ప్రబలుతున్న చిక్కులు
- March 20, 2017
మస్కట్:ఒమాన్ లో చాప కింద నీరు మాదిరిగా ఓ ప్రాణాంతక వ్యాధి కబళిస్తుంది. క్రిమియన్-కాంగో రక్తస్రావంతో కూడిన జ్వరం కారణంగా ముగ్గురు వ్యక్తులు ఇటీవల మరణించగా మరో ఆరుగురు 2017 మొదటి నెలల నుంచి ఆ (సి సి హెచ్ ఎఫ్) చికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం క్రిమియన్-కాంగో జ్వరం కారణంగా సంభవించిన మరణాల రేటు ప్రస్తుతం 37.5 శాతంగా నమోదైందని అని పేర్కొన్నారు. సి సి హెచ్ ఎఫ్ పెరుగుదల కాబడిన సందర్భాల్లో 2016 లో ఇదే కాలంలో పోలిస్తే కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి సి సి హెచ్ ఎఫ్ ఇది ఒక టిక్ అనే వైరస్ వలన కలిగే వ్యాధి. ఆవులు, మేకలు మరియు గొర్రెలు తదితర జంతువుల ప్రభావితంగా మానవులకు సంక్రమించే ఓకే వ్యాధి. టిక్ జీవిగా పేరొందిన ఆ ప్రాణి నేరుగా మనిషిని కుట్టడం ద్వారా శరీరంలోని రక్తం లోనికి ప్రవేశిస్తుంది. లేదా ఆ జంతువుని వదించే సమయంలో వ్యక్తికి ఆ జబ్బు సోకిన జంతువుల ' రక్తం లేదా అవయవాలలో దాగి ఉన్న ఆ జీవి మాంసం నరికే వ్యకిని కుట్టి అతని శరీరంలోనికి ప్రవేశిస్తాయి. దాంతో క్రిమియన్-కాంగో రక్తస్రావంతో కూడిన జ్వరం రావడం క్రమేపి ఆ వ్యక్తి మరణించడం జరుగుతుంది.ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం మరొక మార్గం ఏమిటంటే, ఆ జబ్బు సోకిన వ్యక్తికి చెందిన రక్తం లేదా ఇతర శరీర ద్రవాలు మరొక వ్యక్తి బదిలీ కాబడితే ఆ ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం







