20 మంది ప్రాణాలు తీసిన చెట్టు

- March 20, 2017 , by Maagulf
20 మంది ప్రాణాలు తీసిన చెట్టు

జ‌ల‌పాతం ద‌గ్గ‌ర స‌ర‌దాగా ఈత కొడుతున్న విద్యార్థుల‌పై ఓ భారీ వృక్షం కూలడంతో 20 మంది స్టూడెంట్స్ మృతి చెందారు. మ‌రో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆఫ్రికా దేశం ఘ‌నాలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ స్టూడెంట్స్ ను హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఆఫ్రికాలోని ఘ‌నా దేశంలోని కింటాంపో జ‌ల‌పాతం ద‌గ్గ‌ర ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి అధికారులు మాట్లాడుతూ.. ఆ విద్యార్థులంతా విహార‌యాత్ర‌కు వ‌చ్చార‌ని, వాట‌ర్‌ఫాల్స్ ద‌గ్గ‌ర ఈతకు దిగిన స‌మ‌యంలో తుపాన్‌ వ‌చ్చిందని, అక‌స్మాత్తుగా భారీ వృక్షం విద్యార్థుల‌పై కుప్ప‌కూలిందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com