సమ్మర్‌ సంబరాలకి మనామా సెంట్రల్‌ మార్కెట్‌ సన్నద్ధం

- March 20, 2017 , by Maagulf
సమ్మర్‌ సంబరాలకి మనామా సెంట్రల్‌ మార్కెట్‌ సన్నద్ధం

సమ్మర్‌ సంబరాలకి మనామా సెంట్రల్‌ మార్కెట్‌ సన్నద్ధం 
మనామా: మార్కెట్‌ గోయర్స్‌నీ, వెండర్స్‌నీ ఉల్లాసపరిచేందుకోసం, మెరుగైన మార్కెట్‌ అనుభవాల్ని అందించేందుకోసం సెంట్రల్‌ మార్కెట్‌లో ఎయిర్‌ కండిషనర్ల ఏర్పాటు పూర్తి చేశారు. మీట్‌ అండ్‌ ఫిష్‌ మార్కెట్స్‌ ఇప్పుడు సరికొత్తగా వినియోగదారుల్ని ఆకట్టుకోనున్నాయి వేసవి సందర్భంగా. క్యాపిటల్‌ జనరల్‌ సెక్రెటరీ అధికారులు, మార్కెట్స్‌ని సందర్శించి, అక్కడ ఎయిర్‌ కండిషనర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ధృవీకరించారు. జనరల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది సెక్రెటేరియట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫా మాట్లాడుతూ, పార్కింగ్‌ లాట్స్‌ని రీపేవ్‌ చేయడానికి, అలాగే షాప్స్‌ని రీప్లేస్‌ చేయడానికి టెండర్లను త్వరలో పిలుస్తామన్నారు. 270,000 బహ్రెయిన్‌ దినార్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ 45 రోజుల్లో పూర్తి కానుంది. అధికారులు ట్రేడర్లతోనూ, వెండర్స్‌తోనూ సమావేశమయి, మార్కెట్స్‌లో చేపట్టాల్సిన ఇతర పనుల గురించి చర్చించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com