ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్
- March 20, 2017
షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన లైవ్ కాన్సెర్ట్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, ఆహూతులైన 20,000 మందిని ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు, తన పాటలతో హోరెత్తించారు. షార్జాలో తొలిసారిగా ఇంత పెద్ద వేదికను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకుల్ని అభినందించారాయన. ఎల్ఈడీ స్క్రీన్లతో ఆహూతులకు సరికొత్త అనుభూతిని మిగిల్చారు. ఎక్కువగా మలయాళ, తమిళ పాటలతో హోరెత్తించారు రెహమాన్. మూడ గంటల పాటు సాగిన ఈ షో ఆహూతుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. దిల్‌సె, ఏ జో దేష్ హై మేరా, చయ్యా చయ్యా, ముస్తఫా ముస్తపా, జనగనమన వంటి పాటల్ని ఆలపించిన రెహ్మాన్, ఆహూతులు కూడా తనతో గొంతు కలిపేలా, పాదం కలిపేలా చేయగలిగారు. మధ్య మధ్యలో శ్వేతా మోహన్, కార్తీక్, మెన్నీ దయాల్, రంజిత్ బరోత్, హరిహరన్, జోనితా గాంధీ, నీతి మోహన్, ఆల్ఫాన్స్ జోసెఫ్, జావెద్ అలి తదితరులు వేదికపై సందడి చేశారు. మనసు మనసింతే పాటతో, తన తండ్రి ఆర్కె శేఖర్‌కి నివాళులర్పించారు రెహమాన్.
తాజా వార్తలు
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!







