విష్ణు కొత్త సినిమా 'ఓటర్'

- March 20, 2017 , by Maagulf
విష్ణు కొత్త సినిమా  'ఓటర్'

మంచు విష్ణు దూకుడు మాములుగా లేదు..వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తూ బిజీ హీరో అవుతున్నాడు. ఇటీవలే జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రాన్ని మొదలు పెట్టిన విష్ణు , తాజాగా మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. జిఎస్ కార్తీక్ డైరెక్షన్లో ఓ మూవీ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. దీనికి 'ఓటర్' అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.
విష్ణు సరసన సురభి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
త్వరలోనే దీనికి సంబదిన్చసిన మిగతా వివరాలు తెలియనున్నాయి. 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర విషయానికి వస్తే పద్మజ పిక్చర్స్ బేనర్ మీద కీర్తి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో విష్ణు సరసన కొత్త భామ అయితే బాగుంటుందని అనుకున్న చిత్ర యూనిట్ చివరకు ధనుష్ నటించిన 'అనేగన్' మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమైరా దస్తూర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com