ఉగ్రవాదులపై భారత్ కు బాంగ్లాదేశ్ రిపోర్ట్
- March 21, 2017
బంగ్లాదేశ్ ఇచ్చిన నివేదిక ఒకటి ఇప్పుడు భారత్‌లో కలకలం రేపుతోంది. తమ దేశం నుంచి ఏకంగా 2000 వేలమందికి పైగా ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారని భారత హోంశాఖకు బంగ్లాదేశ్ నివేదిక ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, భారత్‌లో చొరబడిన ఉగ్రవాదులంతా జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ), హర్కత్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామీ(హుజీ) సంస్థలకు చెందినవారని ఆ నివేదికలో పేర్కొంది.
గత ఏడాది వీరు తమ సరిహద్దులను దాటి పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో అడుపెట్టారని తెలిపింది. భారత్‌లో చొరబడిన 2,010 మంది ఉగ్రవాదుల్లో 1,290 మంది అసోం, త్రిపుర రాష్ట్రాల్లో ప్రవేశించగా..మిగతా వారు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లారని పేర్కొంది. ఈ నివేదికతో త్రిపుర, అసోం రాష్ట్రాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా దళాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







