సినిమాలకు శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పనున్న అమల
- March 21, 2017
కింగ్ నాగార్జునని పెళ్ళి చేసుకున్న తరువాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసింది అమల. ఆతరువాత బ్లూక్రాస్ ..యానిమల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ తో బిజీ అయిపోయింది.అయితే శేఖర్ కమ్ముల అడగడంతో చాలాకాలం తరువాత ' లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ' మూవీలో ఓ క్యారెక్టర్ చేసింది అమల. లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన అమలకి ఆ మూవీ ఫ్లాప్ అయ్యి షాక్ ఇచ్చింది. ఆ తరువాత బాలీవుడ్ లో విద్యాబాలన్ లీడ్ రోల్ చేసిన ' హమారి అదూరీ కహానీ ' లో కూడా ఓ సపోర్టింగ్ రోల్ చేసింది అమల. అయితే అక్కడ కూడా అమలకి సక్సెస్ రాలేదు. ఆ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక రీసెంట్ గా అమల యాక్ట్ చేసిన మళయాళం మూవీ ' సైరా భాను ' కూడా ఫ్లాప్ కావడంతో ఇక యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయిందట. నాగ్ అలా ఎందుకు అని వారించినప్పటికీ కఠిననిర్ణయానికే ఆమె మొగ్గుచూపిందని తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్ బ్రేకప్ తో అప్ సెట్ అయిన అమలకి రీ ఎంట్రీ లో వరుస ఫ్లాప్స్ రావడంతో ఇక మీదట బ్లూక్రాస్ యాక్టివిటీస్ కే పరిమితం కాబోతోందట.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







