ఏప్రిల్‌ 5న దోహా ఫెస్టివల్‌ సిటీ ప్రారంభం

- March 21, 2017 , by Maagulf
ఏప్రిల్‌ 5న దోహా ఫెస్టివల్‌ సిటీ ప్రారంభం

దోహా ఫెస్టివల్‌ సిటీ, ఏప్రిల్‌ 5న ప్రారంభం కాబోతోంది. రిటైల్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ సెక్టార్స్‌కి సంబంధించి దేశంలోనే అతి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌గా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం 6 బిలియన్ల ఖతారీ రియాల్స్‌. 433,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఖతార్‌లోనే బిగ్గెస్ట్‌ మాల్‌గా దోహా ఫెస్టివల్‌ సిటీ రికార్డులకెక్కనుంది. ఇందులో నాలుగు థీమ్‌ పార్క్‌లు (జూనివర్స్‌, విర్ట్యూసిటీ, యాంగ్రా బర్డ్స్‌ వరల్డ్‌, స్నో డ్యూన్స్‌), ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, కాన్ఫరెన్స్‌ సెంటర్‌, 8,000 స్పాట్స్‌తో పార్కింగ్‌ ఏరియా దీని ప్రత్యేకతలు. దోహా సిటీ మాల్‌ జనరల్‌ మేనేజర్‌ ట్రెవర్‌ హిల్‌ మాట్లాడుతూ, తమ సంస్థ బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని విజటర్స్‌కి అందించనుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com