నకిలీ నోట్లు: ఖతార్‌లో ఇద్దరి అరెస్ట్
- March 21, 2017
నకిలీ నోట్లని డాలర్స్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోహా క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తి, అలాగే బ్రిటన్‌కి చెందిన మరో వ్యక్తి నకిలీ నోట్లను చెలామణీ చేస్తూ దొరికిపోయారు. 500 ఖతారీ రియాల్స్ బ్యాంక్ నోట్స్‌ని వీరు నకిలీగా మార్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అయితే తాము ఎలాంటి ఫోర్జరీకి పాల్పడలేదనీ తమ వద్ద ఉన్న నోట్లను డాలర్లలోకి మార్చాలనుకున్నామని వారంటున్నారు. 16,500 ఖతారీ రియాల్స్ విలువైన 500 ఖతారీ రియాల్స్ నోట్లను వీరు ఎక్స్చేంజ్ చేయబోయారు. అయితే విచారణలో అవి నకిలీ నోట్లు అని తేలింది. నకిలీ తయారీ కోసం వీరు వినియోగించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







