హైదరాబాద్ నా ఆలోచనలకు ప్రతిరూపమే : చంద్రబాబు

- March 22, 2017 , by Maagulf
హైదరాబాద్ నా ఆలోచనలకు ప్రతిరూపమే : చంద్రబాబు

భవిష్యత్తును ముందుగానే ఊహించి ఇక్కడ ఐటీ రంగానికి పునాది వేశానని ఈ తరహాలోనే ప్రతిరోజు వినూత్నంగా ఆలోచించాలని, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలగుతారని విద్యార్థులకు చంద్రబాబు సూచించారు.  హైదరాబాద్ శివార్లలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ)స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ప్రసంగిస్తూచ అప్పుడూ, ఇప్పుడూ తనకోసం కాకుండా ప్రజల కోసమే పని చేస్తున్నానన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు ధీటుగ సైబరాబాద్‌ను ఏర్పాటు చేశానని తెలిపారు.  ఇప్పుడు ఏపీ ప్రజలు తనపై కొత్త బాధ్యతను పెట్టారని, వారు ఆశించిన స్థాయిలోనే అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించి ప్రపంచంలో టాప్‌-5 అత్యుత్తమ నగరల్లో ఒకటిగా నిలుపుతానన్నారు.  అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏపీకి కూడా రాబోతున్నాయని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com