జులేఖా హాస్పిటల్‌లో మదర్స్‌ డే

- March 22, 2017 , by Maagulf


దుబాయ్‌, యూఏఈ: యూఏఈ మదర్స్‌ డే సందర్భంగా జులేఖా హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు స్టాప్‌, తమ ఆసుపత్రిలో ఇటీవల జన్మనిచ్చిన తల్లులకు పువ్వులు, కేక్‌లతో శుభాకాంక్షలు తెలిపారు. మాతృత్వం గొప్ప అనుభూతి అనీ, మదర్స్‌ డే సందర్భంగా తల్లులను గౌరవించేందుకు, వారిలో ఆనందం నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని జులేఖా హాస్పిటల్‌ కో ఛైర్‌ పర్సన్‌ జానుబియా షామ్స్‌ చెప్పారు. ఈ సందర్భంగా తల్లులందరికీ తమ హాస్పిటల్‌ తరఫున సెల్యూట్‌ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చాక ప్రతి తల్లిలోనూ ఆనందం కన్పిస్తుందనీ, ఆ ఆనందం కోసం తమ హాస్పిటల్‌ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోందని ఆమె అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com