జయంత్‌ హీరోగా నటిస్తున్న సినిమా మిక్చ‌ర్ పొట్లం ప్రివ్యూ..

- March 23, 2017 , by Maagulf
జయంత్‌ హీరోగా నటిస్తున్న సినిమా మిక్చ‌ర్ పొట్లం ప్రివ్యూ..

భానుచందర్‌ తనయుడు జయంత్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘మిక్సర్‌ పొట్లం’. శ్వేతా బసు ప్రసాద్‌ నాయికగా నటిస్తోంది. గోదావరి సినీ టోన్‌ పతాకంపై నిర్మాణవుతున్న ఈ చిత్రానికి సతీష్‌ కుమార్‌ దర్శకుడు. లక్ష్మీ ప్రసాద్‌, కంటె వీరన్న, లంకపల్లి శ్రీనివాస్‌ నిర్మాతలు. మాధవపెద్ది సురేష్‌ సంగీతాన్ని అందించారు. ఇటీవలే ‘మిక్సర్‌ పొట్లం’ ఆడియో విడుద లైంది. పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్ర యూని ట్‌ సభ్యులు చెబుతున్నారు.
దర్శకుడు సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ…’ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. అనుభవం గల సాంకేతిక నిపుణులు పనిచేయడం వల్లే మా సినిమా ఆసక్తి కలిగిస్తోంది. మాధవపెద్ది సురేష్‌ గారు నేటి యువతకు నచ్చే పాటలు స్వరకల్పన చేశారు.
స్వరాలతో పాటు సాహిత్యం బాగా కుదిరింది. సిని మాలో సంగీతానికి చాలా ప్రా ధాన్యత ఉంటుంది.’ అన్నారు. 
నిర్మాతలు కంటె వీరన్న, లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ..’ మా తొలి ప్రయత్నంగా పూర్తి కామెడీ జానర్‌ లో చేస్తున్న సినిమా ఇది. వినోదంతో పాటు కథలో భావోద్వేగ అంశాలుం టాయి. మాధవపెద్ది సురేష్‌ గారు గతంలో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు సంగీతం అందించారు. మా సినిమా కూడా ఆయన హిట్స్‌ లో చేరినందుకు సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగిన సిని మా ఇది. సంగీతం లాగే సినిమాకూ ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.ఈ చిత్రంలో గీతాంజలి, అలీ, భానుచందర్‌, కృష్ణ భగవాన్‌, సుమన్‌, పోసాని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com