బుట్టా కా హల్వా
- March 23, 2017
కావలసిన పదార్థాలు : లేత మొక్కజొన్న గింజలు - మూడు కప్పులు, పంచదార - అరకిలో, నెయ్యి - వంద గ్రాములు, యాలకులు - 5
జీడిపప్పు - 10 పలుకులు, ఎండు ద్రాక్ష - చెంచా
తయారీ విధానం :
ముందుగా మొక్కజొన్న గింజలను మెత్తగా రుబ్బి అందులోంచి పాలను పిండి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఓ పాత్రలో కొంచెం నేయి వేసి అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ నాన్‌స్టిక్ పాన్‌లో గ్లాసు నీళ్లు, పంచదార వేసి మరిగించాలి. కాస్త పాకం వచ్చిన తరువాత మొక్కజొన్న పాలను అందులో వేసి చిక్కబడే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది చిక్కబడి ముద్దలా తయారవుతుంది. అప్పుడు అందులో నెయ్యి వేసి హల్వాలా అయ్యేవరకు కలిపాలి. చివరగా యాలకుల పొడి, నేతిలో వేయించి తీసిన ఎండుద్రాక్ష, జీడిపప్పు ఆ ముద్దలో వేసి కలపాలి. ఇప్పుడు ఈ హల్వాను చిన్న పళ్లెంలో వేసి చల్లారిన తరువాత ముక్కలుగా కోస్తే సరి, నోరూరించే బుట్టా కా హల్వా తయారవుతుంది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







