అనుచిత వ్యాఖ్యలు చేసిన అబ్దుల్ బాసిత్
- March 23, 2017
భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్‌గా ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ డే కార్యక్రమంలో మరోసారి కశ్మీర్ రాగం పాడారు. కాశ్మీరీల ఆకాంక్షలను ప్రతిబింబించేలా జమ్ముకశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిందేనన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్ వేర్పాటువాదులకు ఆయన మద్దతు పలికారు. కశ్మీర్ వేర్పాటువాదులు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్యం కోసమేనంటూ వారిని గట్టిగా వెనకేసుకొచ్చారు. దేవుడి దయ వల్ల కశ్మీర్ వేర్పాటువాదుల పోరాటం త్వరలోనే నెరవేరుతుందని బాసిత్ చెప్పారు. మరోవైపు బాసిత్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత విదేశాంగ శాఖ హితవు పలికింది. ఇంతకన్నా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంపై దృష్టిసారిస్తే మంచిదని భారత్ హితవు పలికింది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







