కేసర్ ఫిర్నీ
- March 24, 2017
కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, బాస్మతి బియ్యం - నూరు గ్రాములు,పంచదార - 200 గ్రాములు, కుంకుమపువ్వు - ఒక గ్రాము, పిస్తా పొడి - ఐదు గ్రాములు, ఏలకుల పొడి - ఐదు గ్రాములు.
తయారుచేసే విధానం
బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టాక, బియ్యాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న బియ్యానికి రెండు వందల మి.లీ. పాలు కలిపి పక్కనుంచుకోవాలి. ఒక పాత్రలో మిగిలిన పాలు పోసి స్టౌ మీద పెట్టి చిక్కబడి మూడో వంతు అయ్యేదాకా మరిగించుకోవాలి. అప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి కలపండి. పంచదార కరిగిన తర్వాత పాలల్లో బియ్యం మిశ్రమాన్ని పోసి కలపాలి. బియ్యం మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. దించేముందు పిస్తాపప్పు ముక్కల్ని, కుంకుమ పువ్వుని వేసి బాగా చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ పైన తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







