మాస్ మహారాజా హిట్ రీమేక్ లో
- March 25, 2017
రవితేజ మళ్ళీ జోరు పెంచారు. విక్రంసిరి దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమాలతో బిజీగా వున్నారు. ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లక్ష్మణ్ అనే దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నారని టాక్ .
తమిళంలో లక్ష్మణ్ తెరకెక్కించిన 'బోగన్' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. అరవింద్ స్వామి - జయం రవి ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. జయం రవి పోషించిన పాత్రకి గాను రవితేజను ఒప్పించాడని తెలిసింది. అరవింద్ స్వామి పాత్ర కోసం మరో హీరోని అన్వేషించే పనిలో వున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







