వలసదారులైన ఉద్యోగుల్ని తగ్గించేందుకు సన్నాహాలు
- March 25, 2017
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, వలసదారులైన ఉద్యోగుల్ని కువైటీలతో రీప్లేస్ చేసేందుకు ప్రయత్నాల్ని చేపట్టనుంది. రానున్న ఐదేళ్ళలోనే పూర్తిగా కువైటీలకు అవకాశం కల్పిస్తారు. క్రమక్రమంగా వలసదారుల్ని తొలగించనున్నారు. కువైటీలకు ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా దేశంలో నిరుద్యోగం తగ్గించడానికి శ్రీకారం చుట్టినట్లు మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ విభాగం కూడా 50 శాతం వలసదారులైన ఉద్యోగుల్ని తొలగించి, వారి స్థానంలో కువైటీలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. వివిధ మంత్రిత్వ శాఖలు ఆయా విభాగాల్లోని వలసదారులకు చెక్‌పెట్టి, కువైటీలకు అవకాశం కల్పించే దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..









