ఆబార్షనులు చేస్తున్న డాక్టర్ అరెస్టు
- March 25, 2017
తల్లి గర్భంలో ప్రాణం పోసుకొని ఇంకా అవయవాలు రూపొందక ముందే ఆ పిండాలను అమానుషంగా హత్య చేస్తూ చట్ట విరుద్ధంగా పలు అక్రమ గర్భస్రావాలను నిర్వహిస్తున్న ఆసియా దేశాలకు చెందిన ఒక మహిళా వైద్యురాలిని శనివారం అరెస్టు చేశారు. ఆమె అరెస్ట్ కు ముందు పోలీసు డైరెక్టరేట్ ఆమె చేస్తున్న ఆమె పాల్పడుతున్న అక్రమ కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపట్టారు. అనంతరం నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సహాయంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టరేట్ ద్వారా ఈ మహిళా వైద్యురాలిని అదుపులోనికి తీసుకొన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆమె వద్ద అధిక పరిమాణంలో వివిధ ప్రమాదకర మాత్రలు, గర్భస్రావాలకు ఉపయోగపడే పలు పరికరాలు, ఇంజెక్టన్లు మరియు వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు లభించాయి. ఆ మహిళా డాక్టర్ నుండి స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలలో పేర్కొన్నారు. ఆ వైద్యురాలిని ప్రజా విచారణ కోసం అప్పచెప్పే ముందు ఆమెపై చట్టరీత్యా చర్యలు చేపడతామని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









