ఉగాది సమ్మేళన్ కు హాజరైన మోదీ
- March 26, 2017
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది సమ్మేళన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చలమేశ్వర్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో నూతన తెలుగు సంవత్సరానికి ఆహ్వానం పలుకుదామని కేంద్ర మంత్రి వెంకయ్య ట్వీట్ చేశారు. ఉగాది వేడుకలను తన నివాసంలో నిర్వహించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







