సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మహేష్ బాబు
- September 28, 2015
తెలంగాణ రాష్ట్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సినీనటుడు మహేశ్బాబు ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోనున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడాక ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మహేశ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.గ్రామాల దత్తత నేపథ్యంగా మహేశ్ నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ఇటీవలే విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. గ్రామాన్ని దత్తత తీసుకునే అంశాన్ని కమర్షియల్ పాయింట్ తీసుకుని తెరకెక్కించిన విధానం అందరికి బాగా నచ్చింది. ఈ చిత్రం ఎందరో ప్రముఖులను కదిలించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ శ్రీమంత్రుడు చిత్రాన్ని చూసి మహేశ్బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన మహేశ్బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్కు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







