కార్మికుల సమస్యల్ని తెలుసుకుంటం: భారత దౌత్యాధికారి
- September 28, 2015
భారత దౌత్యాధికారి ఇంద్ర మణి పాండే, ఒమన్లోని భారతీయ పౌరులు, కార్మికుల అభ్యున్నతి కోసం కృషి చేస్తామన్నారు. ఇండియా నుంచి ఒమన్కి చవకైనా విమాన ప్రయాణం కోసం, ఇంకా మెరుగైన విమాన సౌకర్యాల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మణి పాండే. ఫలాజ్లోని జిందాల్ షాదీద్ హాల్లో జరిగిన ఇండియన్ సోషల్ క్లబ్ సోహార్ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఒమన్ అభివృద్ధిలో భారతీయుల పాత్రను ఆయన కొనియాడారు. సోహార్ పర్యటించడం ఆయనకు ఇదే తొలిసారి. సభ్యులు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. ఇండియన్ సోషల్ క్లబ్ సోహార్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ టాండన్, మణి పాండేకు శుభాకాంక్షలు తెలిపారు. ఒమన్, ఇండియా మధ్య సత్సంబంధాల మెరుగుకు మణి పాండే తనవంతు సహాకారం అందిస్తారని భావిస్తున్నట్లు రాజీవ్ టాండన్ చెప్పారు. అనంతరం లార్సన్ అండ్ టుబ్రో హెవీ ఇంజనీరింగ్ కంపెనీని కూడా మణి పాండే సందర్శించారు. కార్మికులతో కలిసి ఇండియన్ సోషల్ క్లబ్ సోహార్ లంచ్ చేపట్టింది. తన పర్యటనకు గుర్తింపుగా రాయబారి మణి పాండే ఆ ప్రాంతంలో ఓ మొక్కను నాటారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







