శ్రీ హేవళంబి నామ సంవత్సరంలోనికి అడుగు పెట్టాం
- March 28, 2017
వసంత ఋతువు వచ్చేసింది. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేస్తాయి. కోయిలలు కుహు... కుహు రాగాలు పాడుతుంటాయి. ఇటువంటి వసంత ఋతువు ప్రారంభమయ్యేది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. ఆ రోజున అశ్వినీ నక్షత్రం ఉంటుంది. మాసాల్లో చైత్రం, తిథుల్లో పాడ్యమి, నక్షత్రాల్లో అశ్విని మొదటిది. అంటే ఉగాది ...కాలచక్రం ఒక ఆవృతం పూర్తిచేసి మళ్లీ మొదలయ్యే రోజన్నమాట. అందుకే, ఇది కాలానికి సంబంధించిన అతిముఖ్యమైన పండుగ. ఉగాది తెలుగువారు కొత్త సంవత్సరాదిగా జరుపుకుంటారు. కొత్త ఏడాదికి ప్రారంభ దినమైన ఈరోజున వేకువ జామున లేచి నువ్వుల నూనె రాసుకుని తలంటుస్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి నగలు, ఆభరణాలు ధరించాలి. తర్వాత మామిడి, వేప ఆకులతో ఇంటికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. ఉగాది నాడు ఉగాది పచ్చడి తయారు చేసుకుని స్వీకరించాలి. ఇలా షడ్రుచులు కలుపుకొని పచ్చడి చేయడంలో కూడా అర్థముంది. బెల్లం అంటే తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకూ, విజయానికి సంకేతం. వేప అంటే చేదు దుఃఖానికీ, నష్టానికీ, ద్వేషానికీ అపజయానికీ సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖదుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడానికి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.ఉగాది నాటి సాయంత్రం తప్పక చేయాల్సింది పంచాంగ శ్రవణం. ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు ఉండే పంచాంగ శ్రవణం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ ఉగాదిన మనం శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. మన పెద్దలు చెప్పిన ప్రకారం ఉగాదిని ఆచరిస్తే ఆయురారోగ్యాలూ వస్తాయి. మన " మా గల్ఫ్ డాట్ కామ్ " పాఠకులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు !!
తాజా వార్తలు
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!







