సౌక్ .కామ్ ను దక్కించుకున్న అమెజాన్

- March 28, 2017 , by Maagulf
సౌక్ .కామ్ ను దక్కించుకున్న అమెజాన్

మధ్యప్రాచ్యంలో అతిపెద్ద ఆన్లైన్ స్టోర్ ' సౌక్ .కామ్ ' ని దక్కించుకోవడం కోసం జరిగిన ఓకే వేలం యుద్ధంలో  అమెరికాకు చెందిన అమెజాన్ ఒక గుర్తుతెలియని పెద్ద మొత్తానికి స్వాధీనం చేసుకొంది. వార్తా సంస్థల కధనం మేరకు ఈ ఒప్పందం అసలు కంటే తక్కువ మొత్తానికి ' సౌక్ .కామ్ ' 800 మిలియన్ డాలర్ల కు వదులుకున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు పెట్టుబడిదారుల దృష్టిని సౌక్ .కామ్  అమ్మకంని ఆకర్షించింది. స్థానికంగా ఎదిగిన బ్రాండ్ ఎమ్మార్ సైతం ఈ అధికారిక వేలంలో పాల్గొంది. 2005 లో దుబాయ్ లో స్థాపించబడిన ' సౌక్ .కామ్ ' గత 12 సంవత్సరాలుగా ఒక ఆరోగ్యకరమైన అభివృద్ధిని సాధించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆన్లైన్ వేదిక ద్వారా 8.4 మిలియన్ల వివిధ ఉత్పత్తులను సరసమైన ధరలకు నేరుగా వినియోగదారుల చెంతకు అందచేసినట్లు రికార్డ్ ను నమోదు చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com