ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులు రియాద్‌లో

- March 28, 2017 , by Maagulf
ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులు రియాద్‌లో

పొట్టచేత పట్టుకొని ఉపాధి కోసం గంపెడాశలతో విదేశాల దారి పట్టిన ముగ్గురు మహిళలు, ఒక డ్రైవర్‌ సౌదీ అరేబియా రియాద్‌లో వేధింపులకు గురవుతున్నట్లు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్‌ మంగళవారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ మూడేళ్ల క్రితం, నగరంలోని కాలాపత్తర్‌కు ఇద్దరు మహిళలు మార్చి మొదటివారంలో దూద్‌బౌలికి చెందిన ఏజెంట్‌ మాటలు నమ్మి బ్యూటీపార్లర్‌లో ఉద్యోగం కోసం రియాద్‌ వెళ్లగా అక్కడ యజమానురాలు మహా ఆయద్‌ టుర్కి అనాజి ఇన్‌ అల్‌ యుర్‌ముక్‌ వారిని తన ఇంట్లో పనిమనుషులను చేసింది. యజమానురాలు కుమారుడు గదిలో బంధించి లైంగిక¹ంగా హింసిస్తున్నారని బాధితులు ఫొటోలు, వీడియోలు, వాయిస్‌ మెయిల్స్‌ పంపించారని ఆయన పేర్కొన్నారు.
మూడేళ్లు దాటినా తిరిగి పంపించకుండా ప్రశ్నిస్తే దొంగతనం కేసుల్లో ఇరికించి స్థానిక పోలీసులకు అప్పగించేందుకు బెదిరిస్తున్నట్లు బాధితులు తెలిపినట్లు చెప్పారు. వీరితోపాటు 2016లో వెళ్లిన ఓ డ్రైవర్‌ కూడా ఉన్నాడని అతడ్ని సైతం వేధిస్తున్నారని విదేశాంగ శాఖ అధికారులు కలగజేసుకుని బాధితులను రక్షించాలని ఆయన మంత్రిని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com