ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులు రియాద్‌లో
- March 28, 2017
పొట్టచేత పట్టుకొని ఉపాధి కోసం గంపెడాశలతో విదేశాల దారి పట్టిన ముగ్గురు మహిళలు, ఒక డ్రైవర్ సౌదీ అరేబియా రియాద్‌లో వేధింపులకు గురవుతున్నట్లు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ మంగళవారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మూడేళ్ల క్రితం, నగరంలోని కాలాపత్తర్‌కు ఇద్దరు మహిళలు మార్చి మొదటివారంలో దూద్‌బౌలికి చెందిన ఏజెంట్ మాటలు నమ్మి బ్యూటీపార్లర్‌లో ఉద్యోగం కోసం రియాద్ వెళ్లగా అక్కడ యజమానురాలు మహా ఆయద్ టుర్కి అనాజి ఇన్ అల్ యుర్ముక్ వారిని తన ఇంట్లో పనిమనుషులను చేసింది. యజమానురాలు కుమారుడు గదిలో బంధించి లైంగిక¹ంగా హింసిస్తున్నారని బాధితులు ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెయిల్స్ పంపించారని ఆయన పేర్కొన్నారు.
మూడేళ్లు దాటినా తిరిగి పంపించకుండా ప్రశ్నిస్తే దొంగతనం కేసుల్లో ఇరికించి స్థానిక పోలీసులకు అప్పగించేందుకు బెదిరిస్తున్నట్లు బాధితులు తెలిపినట్లు చెప్పారు. వీరితోపాటు 2016లో వెళ్లిన ఓ డ్రైవర్ కూడా ఉన్నాడని అతడ్ని సైతం వేధిస్తున్నారని విదేశాంగ శాఖ అధికారులు కలగజేసుకుని బాధితులను రక్షించాలని ఆయన మంత్రిని కోరారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







