ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కన్ను భారత గగనతలంపై

- March 28, 2017 , by Maagulf
ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కన్ను భారత గగనతలంపై

ఎయిర్‌లైన్స్‌ ఏర్పాటుకు 100 విమానాల కొనుగోలు
న్యూఢిల్లీ: భారత విమానయాన రంగంలోకి అడుగుపెట్టేందుకు ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సన్నాహాలు చేస్తోం ది. భవిష్యత దృష్టి ఉన్న ప్రధాని మోదీ త్వరలోనే భారతలో 100 శాతం విదేశీ పెట్టుబడులతో ఎయిర్‌లైన్స్‌ సంస్థలను ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలను అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సిఇఒ అక్బర్‌ అల్‌ బకర్‌ చెప్పారు. భారతలో అవకాశాలను దృష్టిలో ఉంచుకొని 100 కొత్త జెట్‌లైనర్స్‌ కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చే విషయం పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆఖరులోగానే ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఈ భారీ ఆర్డర్‌ను ఇచ్చే అవకాశం ఉందని అల్‌బకర్‌ వెల్లడించారు.
దేశీయ విమానయాన రంగంపై ఇటీవల కాలంలో విదేశీ సంస్థల ఆసక్తి బాగా పెరిగింది. అబుదాబికి చెందిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ కొంతకాలం క్రితం జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇండియాలో 24 శాతం వాటా తీసుకొంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మలేషియాకు చెందిన ఎయిర్‌ ఆసియా రెండూ టాటాలతో కలిసి జాయింట్‌ వెంచర్‌లో ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించాయి. ఈ రెండు సంస్థలకు భారత అనుబంధ సంస్థలో 49 శాతం చొప్పున వాటా ఉంది.
ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో పెట్టుబడులకు సంబంధించి విదేశీ ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు పరిమితులు విధించారు. విదేశీ ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు దేశీయ కంపెనీల్లో 49 శాతం కంటే మించి వాటా ఉండటానికి వీల్లేదు. విమానయాన రంగం కాకుండా ఇతర రంగాల్లోని విదేశీ సంస్థలు మాత్రం 100 శాతం పెట్టుబడి పెట్టే వెసులుబాటునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com