పూరి కొత్త సినిమా 'హే భగవాన్'

- March 29, 2017 , by Maagulf
పూరి కొత్త సినిమా 'హే భగవాన్'

హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసే డైరెక్టర్ పూరీ జగన్నాధ్ . కేవలం మూడు నెలల్లోనే సినిమా తీసి , థియేటర్స్ లలో రప్పించగల డాషింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రోగ్ సినిమా ప్రమోషన్స్ లలో బిజీ గా ఉన్నాడు. ఈ సందర్భాంగా పూరి మాట్లాడుతూ..ప్రస్తుతం బాలకృష్ణ తో ఓ మూవీ చేస్తున్నాని , ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని తెలిపాడు. ఈ మూవీ తర్వాత 'హే భగవాన్' అనే మూవీ చేస్తానని తెలిపాడు.
కాకపోతే ఈ చిత్రం లో ఎవరు హీరో హీరో అనేది చెప్పకుండా, దేవుళ్ల కారణంగా ఈ ప్రపంచానికి ఎలాంటి కష్టాలు వస్తున్నాయనే అంశాన్ని మూవీలో చూపించబోతున్నట్లు చెప్పాడు పూరీ.
ఇక ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ.. రోగ్ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఈ మూవీ మార్చ్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇటీవల కాలంలో పూరి వరుస ప్లాప్స్ తో ఉన్నాడు.
మరి రోగ్ అయిన హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com