ఉచిత ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ని ప్రారంభించిన మవసలాత్‌

- March 29, 2017 , by Maagulf
ఉచిత ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ని ప్రారంభించిన మవసలాత్‌

మస్కట్‌:ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ మవసలాత్‌, ఒమన్‌టెల్‌తో కలిసి సంయుక్తంగా, ప్రయాణీకులకు ఉచిత అన్‌లిమిటెడ్‌ ఇంటర్‌నెట్‌ సర్వీసుల్ని అందించనుంది. మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలోని పలు ఇంటర్నల్‌ రూట్స్‌లో ఈ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర గవర్నరేట్స్‌కి వెళ్ళే ఎక్సటర్నల్‌ రూట్స్‌లోనూ, సుల్తాన్‌ కబూస్‌ యూనివర్సిటీ బస్‌ ఫ్లీట్‌లోనూ ఇంటర్నెట్‌ సర్వీసుల్ని ఉచితంగా అందిస్తున్నట్లు మవసలాత్‌ ప్రతినిథులు తెలిపారు. డిసెంబర్‌ 2016లో మవసలాత్‌, ఒమన్‌టెల్‌ ఉచిత వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సర్వీసులకు సంబంధించి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మవసలాత్‌ బస్సుల్ని మరింతగా ప్యాసింజర్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకోసం ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఒమన్‌టెల్‌, ఓరెండూ, రెన్నా తదితర ఆపరేటర్ల సహకారంతో ప్రయాణీకులకు ఉచిత ఇంటర్నెట్‌ సర్వీసుల్ని మవసలాత్‌ అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com