హెచ్-1బి వీసాల లాటరీ పద్ధతి పై అమెరికాలో కేసు కొట్టివేత
- March 29, 2017
వాషింగ్టన్: హెచ్-1బి వీసాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసును ఓరెగాన్‌లోని ఫెడరల్ న్యాయమూర్తి కొట్టివేశారు. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బీ వీసాల జారీలో ఎలాంటి మార్పు లేనందున ఈ నిర్ణయానికి వచ్చినట్లు న్యాయమూర్తి గత వారం ఇచ్చిన తీర్పులో ప్రకటించారు. దీంతో లాటరీలో ఎంపికైనవారికి ‘అమెరికా పౌరసత్వ, వలస సేవల’(యూఎస్సీఐఎస్) విభాగం గుర్తింపును ఇవ్వనుంది.
ఇద్దరు భారతీయ అమెరికన్లపై కేసు
నకిలీ పత్రాలతో భారత నిపుణులకు హెచ్1బీ వీసాలు తెచ్చిపెట్టారంటూ ఇద్దరు భారతీయ అమెరికన్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కాలిఫోర్నియాకు చెందిన డైనసాఫ్ట్ సినెర్జీ సీఈవో జయవేల్ మురుగన్, అదే సంస్థకు చెందిన మరో ఉన్నతాధికారి సయ్యద్ నవాజ్‌లపై ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఆరోపణలు రుజువైతే వీరికి 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష లేదా 1.62 కోట్ల జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. అమెరికా ఫెడరల్ న్యాయస్థాన పత్రాల ప్రకారం.. వీరిద్దరూ సిస్కో, బ్రొకేడ్ లాంటి ప్రముఖ సంస్థల్లో విదేశీయులకు ఉద్యోగాల కల్పించేందుకు హెచ్1బీ దరఖాస్తులు సమర్పించారు.
అయితే ఈ వీసాల మీద వచ్చిన వారిని దరఖాస్తుల్లో పేర్కొన్న సంస్థలకు పంలేదు. 2010 నుంచి 2016 మధ్యకాలంలో వీరు ఈ అక్రమాలను కొనసాగించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







