కతర్ రైల్వే నియామకాలు చేపట్టినట్లు ఫేస్బుక్ లో నకిలీ ప్రకటన
- March 30, 2017
సామాజిక మాధ్యమాలు కొన్ని అబద్ధాలు పని కట్టుకొని ప్రచారం చేస్తూ పలువురిని అయోమయానికి గురిచేస్తున్నాయి. ఖతార్ రైల్ ఉద్యోగ నియమాకాలు జరుపుతున్నట్లు సిబ్బంది కావాలంటూ సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్టు చక్కర్లు కొడుతుంది. అందుకు సంబంధించిన చిత్రం సైతం ఆ ప్రచారంకు మరింత నమ్మకం కల్గించే రీతిలో ఇంటర్నెట్ లో ప్రాచుర్యం పొందింది. కతర్ రైల్వే ఉద్యోగుల మాదిరిగా దుస్తులు ధరించి కొందరు ఆ చిత్రంలో ఒక గుంపుగా నుంచొని " ఒక శీర్షిక వాదనలు కతర్ రైల్ ఇప్పుడు కొత్త సిబ్బందిని తీసుకోవటానికి సన్నాహాలు చేస్తుంది " ప్రచారం ఎందరినో ఆకట్టుకొంటుంది. . ఏ జాతీయత వారైనా కతర్ రైల్ సంస్థలో ఉద్యోగాలకు అర్హులని, అలాగే ఏ రంగంలోని వారైనా సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని డిగ్రీ లేదా డిప్లొమా విద్యార్హత కలిగి ఉంటె చాలని ప్రకటించారు..దీనిపై స్పందిన ఖతార్ రైల్ ఆ చిత్రంకు తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఆ ప్రకటన కేవలం నకిలీదని చెప్పారు, తమ కంపెనీని అడ్డం పెట్టుకొని ఈ మోసం వెనుక ఉన్నారని అమాయక ప్రజలు వీటిని నమ్మరాదని తెలిపింది. సామాజిక మాధ్యమాలలో అసత్య వాదనలను త్రిప్పికొట్టడానికి ఖతార్ రైల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోసపోవద్దని తెలిపింది. తన సంస్థ ఎక్కడైనా ఏ నియామక ప్రకటనలో ఉంచుతారని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందుతున్న చిత్రం ఒక నకిలీది అని పునరుద్ఘాటించారు. కంపెనీకి చెందిన లోగో లేదా కంపెనీ కంపెనీ యాజమాన్య హక్కుల ఉల్లంఘన అధికారులకు నివేదించారు సంస్థ అనుమతి లేకుండా ఏ కాపీరైట్ ఉపయోగించి వారు ఈ మోసానికి పాల్పడ్డారో చర్యలు తీసుకొంటామని సంస్థ ప్రతినిధి అరబిక్ లో ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







