ఇద్దరు తీవ్రవాదుల మృతి , నల్గురు తీవ్రవాదులు అరెస్టు
- March 30, 2017
జెడ్డా:సౌదీ అరేబియా లోని తూర్పు ప్రాంతంలో తీవ్రవాదులు ఉంటున్న ఒక రహస్య స్థావరంపై భద్రత దళాలు వ్యూహాత్మక ఆకస్మిక దాడి జరిపేరు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రవాదులు కాల్పులలో మరణించగా మరో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఆంతరంగిక మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. మంగళవారం భద్రతా దళాలు జరిపిన ప్రణాళిక దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. ఉత్తర అహ్వామియహ్ లో ఒక వ్యవసాయ క్షేత్రంపై భద్రతా దళాలు ఆకస్మిక దాడి చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ మన్సోర్ అల్ తుర్కీతెలిపారు. ఉగ్రవాదులపై భద్రతా దళాలు జరిగిన కాల్పులలో మహమ్మద్ తాహిర్ మహమ్మద్ అల్ నిమ్రా మరియు మోక్డ్డ్డు మహమ్మద్ హసన్ అల్ నిమ్రా మృతి చెందారు. అంతేకాక మరో నల్గురు అరెస్టు చేశారు అబ్దుల్రహ్మాన్ ఫెడెల్ అబ్దుల్లా అల్ అబ్దుల 'అల మహ్మద్ జాఫర్ అబ్దుల్లా అల్ అబ్దుల 'అల, జఫర్ మహమ్మద్ అల్ ఫారాజ్ మరియు వాసప్, ఆలీ మక్కి అల్ క్ర్స్ , మంత్రిత్వ శాఖ తెలిపింది. పట్టుబడిన తీవ్రవాదులకు నేర నేపధ్యం ఉంది. తీవ్రవాద చర్యల ఆరోపణలు ఎదరొకొంటున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.తీవ్రవాదల శిభిరంలో పొటాషియం, మెషిన్ గన్స్ మూడు మాగ్ జైన్ , మందుగుండు 71 రౌండ్లు, మరియు ఒక నల్ల ముసుగులతో సహా వ్యవసాయ క్షేత్రంలో కనుగొనబడ్డాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







