భారతీయ డాక్టర్ మీదగా కారు నడిపిన అరబ్ వ్యక్తి
- March 30, 2017యు.ఏ.ఈ:ఒక నివాస ప్రాంతంలో ఒక ఆసియా డాక్టర్ ని వేధింపులకు గురిచేసాడనే ఆరోపణలపై అరబ్ వ్యక్తిపై కోర్టు నేరం మోపింది. అరబిక్ రోజువారీ దినపత్రిక అల్ బయన్ తెలిపిన వివరాల ప్రకారం బాధితుడైన వైద్యుడు దుండగుడుతో జరిగిన ఒక వాదనలో పాల్గొన్నాడని నివేదించింది.దాంతో అరబ్ వ్యక్తి నేరుగా డాక్టర్ యొక్క వాహనం వెనుక తన వాహనాన్ని నిలిపి డాక్టర్ ముందుకు వెళ్లనీయకుండా నిరోధించాడని తెలుస్తుంది. ఒక తీవ్రమైన వాదన అనంతరం అరబ్ వ్యక్తి మరింత గొడవ పెద్దది చేయబోయాడు. దీనితో పొరుగున ఉన్న సెక్యూరిటీ దళాలు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో ఆగ్రహించిన అరబ్ వ్యక్తి ఆసియా డాక్టర్ కొట్టదమే కాక, దుండగుడు తన కారుతో భారతీయ డాక్టర్ కారుని వేగంగా వచ్చి ఢీ కొట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఈ ప్రమాదంలో బాధితుని భుజంకు తీవ్ర గాయం అయ్యంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు