చెట్టినాడ్‌ మటన్‌ కర్రీ

- March 30, 2017 , by Maagulf
చెట్టినాడ్‌ మటన్‌ కర్రీ

కావలసిన పదార్థాలు: మటన్‌: అరకిలో, దాల్చినచెక్క: చిన్న ముక్క, లవంగాలు: మూడు లేక నాలుగు, యాలకులు: రెండు, ఉల్లిపాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు: టేబుల్‌ స్పూను, టమోటాలు: రెండు(చిన్న ముక్కలుగా చేసుకోవాలి), కొబ్బరిపాలు: కప్పు, ఉప్పు: రుచికి సరిపడ, కారం: అవసరం అనుకుంటే స్పూను, నూనె: తగినంత. 
మసాలా ముద్ద కోసం: దాల్చినచెక్క: మీడియం సైజు ముక్క, లవంగాలు: మూడు లేక నాలుగు, యాలకులు: రెండు లేక మూడు, జీలకర్ర: టేబుల్‌స్పూను, సోంపు: టేబుల్‌స్పూను, ఎండుమిరపకాయలు: ఐదు లేక ఆరు, ధనియాలు: మూడు టేబుల్‌స్పూన్లు, కొబ్బరితురుము: మూడు టేబుల్‌స్పూన్లు, నూనె: మూడు టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు: ఐదు లేక ఆరు. 
తయారీ విధానం: ముందుగా మటన్‌ ముక్కలకి పసుపు, ఉప్పు పట్టించి గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగానూనె వేసి కొబ్బరి తురుము తప్ప మసాలా దినుసులు అన్నీ వేసి దోరగా వేయించుకుని చల్లారిన తరువాత కొబ్బరి తురుముతో సహా మెత్తగా ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌ను పొయ్యి మీద పెట్టి నూనె పోసి కాగిన తరువాత దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. అనంతరం ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరికొద్దిసేపు వేయించి ఇప్పుడు టమోటా ముక్కలు, మసాలా ముద్ద వేసి మరికొద్దివేయించి అనంతరం మటన్‌ ముక్కలు వేసి ఓ ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు తగినంత నీరు పోసి మూడు లేదా నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉంచి దించేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com