గుండెకు మేలు చేసే స్ప్రింగ్ ఆనియన్స్

- March 30, 2017 , by Maagulf
గుండెకు మేలు చేసే స్ప్రింగ్ ఆనియన్స్

ఉల్లికాడలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఉల్లికాడలను మష్రూమ్స్, క్యాలీఫ్లవర్, కోడిగుడ్డు, బంగాళాదుంపలతో కలిపి వండుకోవచ్చు. ఉల్లికాడల్లో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లికాడల్లో వ్యాధి నిరోధక లక్షణాలు ఉండడంతో జలుబు, జ్వరం త్వరగా దరిచేరవు. ఇంకా ఇందులోని లో క్యాలరీలు బరువు తగ్గడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. 
 గుండె, రక్తనాళాలకు మేలు చేసే ఉల్లికాడలు.. కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల్ని కూడా దూరం చేస్తుంది. ఉల్లికాడల్లో నీటిలో కరిగే కొల్లాయిడల్‌ కార్బోహైడ్రేట్‌ ఉంటుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ఇబ్బంది పడుతున్న వారు రోజు వారీ ఆహారంలో అరకప్పు ఉల్లికాడలను తీసుకోవడం మంచిది. ఈ ఉల్లికాడల్లో పప్పు చేర్చి రుచికరమైన దాల్ చేసుకోవచ్చు. ఇంకా సలాడ్స్‌లోనూ ఉపయోగించవచ్చు. వంటల తయారీ పూర్తయ్యాక ఉల్లికాడల తరుగును గార్నిష్ కోసం కూడా ఉపయోగిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com