ఆసుపత్రి తప్పిదం.. రక్తం గడ్డకట్టిన నవజాత శిశువు చేయి

- March 30, 2017 , by Maagulf
ఆసుపత్రి తప్పిదం.. రక్తం గడ్డకట్టిన నవజాత శిశువు చేయి

వైద్యపరమైన నిర్లక్ష్యాలు పసి పిల్లలకు శాశ్వతకాల శాపాలుగా పరిణమిస్తున్నాయి. ఓ సౌదీ తండ్రి  ప్రభుత్వ ఆస్పత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేశాడు. వారు తన నవజాత శిశువు చేతిని చేధించారని వైద్యపరంగా ఆ తప్పు జరిగిందని అబూ అరీస్ లోని ఆసుపత్రిపై ఆయన ఆరోపణలు చేశారు. ఆరోగ్య వ్యవహారాల శాఖ ప్రస్తుతం తన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ శిశువు తండ్రి అబ్దుల్ అజిజ్ మాక్రోషి పేర్కొన్నారు. నా కుమారుడు మన్సోర్ కు 30 రోజుల వయస్సు మాత్రమే ఉందని అబూఅరీస్ లోని జనరల్ ఆసుపత్రిలో మా చిన్నారికి వైద్యులు హడావిడిగా చేసిన చికిత్స కారణంగా ఒక తప్పు జరిగిందన్నారు. వారు ఇచ్చిన ఒక ఇంజక్షన్ కారణంగా శిశువు అరచేతికి రక్త ప్రసారం నిలిచి గడ్డ కట్టడం వాస్తవమేనని ఆసుపత్రి వర్గాలు సైతం అంగీకరించాయి. ఆసుపత్రివర్గాలు తన పిల్లవాడి చేతిని ఛేదించిన కారణంగా, చిన్నారికి  చికిత్స కోసం విదేశాల్లో వైద్యం చేయించాలని తాను ఆరోగ్య మంత్రిత్వ శాఖని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తన అభ్యర్థనను ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆమోదించలేదని దీనితో తాను జజాన్ లో ఉన్న కింగ్ ఫహద్ సెంట్రల్ ఆస్పత్రి వర్గాలు తగినన్న పడకలు లేవనే సాకు చెబుతూ, తన కుమారుడిని ఆ ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారని వివరించారు. దీనితో నేను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి నా కుమారుడిని చేర్పించినట్లు అక్కడ వైద్యులు నా కుమారుడి చేతిని చేదించారని మాక్రోషి చెప్పారు.జజాన్ ఆరోగ్య వ్యవహారాల ప్రతినిధి నబిల్ గవి మాట్లాడుతూ,బాలుని తండ్రి మాక్రోషి చేసిన ఫిర్యాదుని  డైరెక్టరేట్ స్వీకరించిందని దానిపై ఒక విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఒక వైద్య లోపం అనుమానం ఉన్న సందర్భ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న వైద్యులు, సిబ్బంది అందర్నీ ప్రశ్నించినట్లు తెలిపారు. మరింత విచారణ కోసం షరియా కమిటీ ఎదుటకు పంపబడనున్నట్లు నబిల్ గవి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com